హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తిరుపతి నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక సమస్యలతో కొద్దిసేపు నిలిచిపోయింది. రైలు బోగీ చక్రం వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా వేదాయపాలెం వద్ద అధికారులు రైలును నిలిపివేశారు. రైల్వే సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో అర్ధగంట తరువాత అక్కడ నుంచి తిరిగి బయలు దేరింది.