గార్ల, మే 27: ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు వచ్చిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలో రాంపురం వద్ద శనివారం చోటుచేసుకున్నది. హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ రైలు గార్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రాంపురం వద్దకు రాగానే.. బ్యాటరీ సాంకేతిక లోపం వల్ల ఏసీ బోగి బీ2 నుంచి ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించాయి.
40 నిమిషాలు ఆగిపోయింది. తనిఖీల అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు రైలు బయలుదేరి వెళ్లింది.