Akhanda 2 | ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఏ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అఖండ 2: తాండవం’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావలసి ఉన్నా పలు కారణాల వలన వాయిదా పడింది. ఇక ఎట్టకేలకి డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోస్ పడనున్నాయి. తెలంగాణలో కూడా ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సీక్వెల్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అనే చెప్పాలి. విడుదల వాయిదా పడినప్పటికీ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం రెండింతలు పెరిగింది.
తాజాగా తెరుచుకున్న లిమిటెడ్ బుకింగ్స్‌తోనే అఖండ 2 ఏ రేంజ్లో ర్యాంపేజ్ చేస్తుందో స్పష్టమైంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు..ఎక్కడ చూసినా బాలయ్య సినిమాకే భారీ డిమాండ్. తెలుగు స్టేట్స్లో ఇంకా అన్ని షోలు ఓపెన్ కాకపోయినా, బుక్ మై షోలో లక్షల్లో టికెట్లు అమ్ముడైపోతున్నాయి.ఈ హడావిడి చూస్తుంటే ఆడియెన్స్‌లో ఉన్న మ్యాడ్నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ కాకముందే అఖండ 2 భారీ టికెట్ సేల్ సాధించింది. ఈ వేగం కొనసాగితే ప్రీమియర్స్‌తో పాటు డే 1 తెలుగు స్టేట్స్ + ఓవర్సీస్ మొత్తం వసూళ్లు డబుల్, ట్రిపుల్ అవుతాయన్నది ట్రేడ్ వర్గాల అంచనా.
పూర్తి బుకింగ్స్ ఓపెన్ చేయగానే రికార్డు ఓపెనింగ్స్ పక్కానే అని విశ్లేషకులు చెప్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబోకు ఇది మరో సూపర్ హిట్ ఓపెనర్‌గా నిలవడం ఖాయం. ఈ భారీ యాక్షన్ డ్రామాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ కాగా, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టడం ఖాయమే అంటున్నారు. ‘అఖండ’ లానే ఈ సీక్వెల్ కూడా థియేటర్లలో ఓ తాండవమే సృష్టించబోతోందని అభిమానులు నమ్ముతున్నారు.