న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ(Nitin Gadkari) ఇవాళ లోక్‌సభలో ఇథనాల్ గురించి కీలక ప్రకటన చేశారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్ పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డురవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పందించారు. ఇథనాల్ పెట్రోల్‌పై చాలా విస్తృత స్థాయిలో పరీక్షలు జరిగినట్లు చెప్పారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడిన కార్లలో ఎటువంటి చెడు ప్రభావం కనిపించలేదని అన్నారు.
ఈ-20 పెట్రోల్ వాడకం చాలా ఆరోగ్యకరమైన పరిణామం అని, ఇది హరిత మార్పు అని, ఈ పెట్రోల్‌తో చాలా తక్కువ కాలుష్యం ఉంటుందని, దీని వల్ల విదేశీ మారకం కూడా ఎక్కువగా ఆదా అవుతుందని లోక్‌సభలో గడ్కరీ తెలిపారు. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల .. ముడి సరుకుల కోసం రైతులకు 40 కోట్లు ఇవ్వడం జరుగుతోందని, ఇథనాల్ తయారీ కోసం చెరుకు, మొక్కజొన్న ముడి పదార్ధాలను వాడుతున్నట్లు ఆయన తెలిపారు.
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అమలు ద్వారా .. గతంలో క్రూడ్ ఇంధనం దిగుమతి కోసం అయ్యే ఖర్చును ఇప్పుడు రైతులకు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనితో రైతులు అన్నదాతలే కాదు, ఇప్పుడు ఊర్జదాతలు కూడా అయినట్లు ఆయన పేర్కొన్నారు. గడిచిన 11 ఏళ్లలో అంటే 2014 నుంచి 2025 జూలై వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్‌ను బ్లెండ్ చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో విదేశీ మారక రూపంలో సుమారు 1.40 లక్షల కోట్లు ఆదా అయినట్లు మంత్రి పేర్కొన్నారు.
Union Minister @HardeepSPuri replies to the questions asked by member during #QuestionHour in #LokSabha regarding Vehicles Compatible for E10 and E20 Fuel Standards.@loksabhaspeaker @LokSabhaSectt#ParliamentWinterSession @MORTHIndia… pic.twitter.com/BWaeXDEryF
— SansadTV (@sansad_tv) December 11, 2025