హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లఎన్నికలు 29న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 26వేలకు పైగా బడుల్లో కొత్త ఎస్ఎంసీలు కొలువుదీరనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఎస్ఎంసీలకు చివరిసారిగా 2019లో డిసెంబర్లో ఎన్నికలు జరగ్గా, వీటి గడువు 2021 డిసెంబర్‌తో ముగిసింది. కరోనా తర్వాత పరిస్థితుల కారణంగా వీటి కాలపరిమితిని పలుసార్లు పొడిగిస్తూ వచ్చారు.