HomeTelanganaSm Mujeeb Hussaini Has Been Elected As The Convenor Of The Tngo Ad Hoc Committee
అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) రంగారెడ్డి జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఎన్నికయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) రంగారెడ్డి జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఎన్నికయ్యారు. సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కమిటీని ప్రకటించారు.
కో కన్వీనర్‌గా కస్తూరి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులుగా ముత్యాల సత్యనారాయణగౌడ్, ఈశ్వర్, యశ్వంత్, ఆర్ రంగయ్య, ఎం శ్రీనివాసరావు, ఏ మహేందర్, బీ మాధవ్‌గౌడ్, మహమ్మద్ అజ్మత్ అలీ, కే వాణిని ఎన్నుకున్నారు. ఆరు నెలల్లోపు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ముజీబ్ ప్రకటించారు.