SLBC | మహబూబ్నగర్ : ఎస్ఎల్బీసీ టన్నెల్లో పేరుకుపోయిన బురదను తొలగించే ప్రక్రియ షురూ అయింది. గురువారం నాడు సహాయక చర్యల్లో భాగంగా ఒక వైపు డీ వాటరింగ్ చేస్తూ, మరో వైపు బురదను లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకువస్తున్నారు. టీబిఏం మిషన్ సమీపంలో పడిఉన్న సామాగ్రిని కూడా తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే తప్ప సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
బురద తొలగించిఏ పనులను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్లు పర్యవేక్షిస్తున్నారు. సొరంగం నుంచి పెద్ద ఎత్తున బురద బయటకు తీస్తున్నారు. లోకో ట్రైన్ వెళ్లి రావడానికి గంట సమయం పడుతుంది. పెద్ద ఎత్తున కూలీలను ఉపయోగించి.. లోపల హిట్యాచి ద్వారా బురదను బయటికి తకలిస్తున్నారు. భారీ యంత్రం సహాయంతో వీటిని తీసి టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈరోజు మొత్తం ఇదే కార్యక్రమం సాగుతుందని.. బురద తీసాక పరిస్థితిని అంచనా వేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా అనేదానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెబుతున్నారు.
టిబిఏం మిషన్ కట్టింగ్ ప్రారంభం..
ఒక వైపు బురద తొలగిస్తూనే మరో వైపు టీబిఏం మిషన్ను చిన్న చిన్న బాగాలుగా కట్ చేస్తున్నారు. ఈ భాగాలను కూడా వేరు చేసి బయటకు తీస్తున్నారు. ముందుగా రెండుకిలోమీటర్ల వద్ద బురదను క్లియర్ చేస్తున్నారు.