ఘట్ కేసర్/పోచారం/శంషాబా రూరల్, ఏప్రిల్ 15: రిజిస్ట్రేషన్లలో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఘట్కేసర్, నారపల్లి, శంషాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద మంగళవా రం వారు ఆందోళనకు దిగారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానంతో తాము రోడ్డునపడే దు స్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఘట్కేసర్లో ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తంచేశారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు దొరకక దస్తావేజు లేఖరి వృత్తిని ఎంచుకొని ఉపాధి పొందుతున్నామని, స్లాట్బుకింగ్తో ఊపాధి కోల్పోతున్నామని తెలిపారు. పో చారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుం చే దస్తావేజుల తయారీ పనులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు రంగ నరేందర్‌గౌడ్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్‌కు వినతి పత్రం అందజేశారు.