హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆదివారం చలి స్వల్పంగా పెరిగింది. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడవచ్చని పేర్కొన్నది.