హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్‌సాఫ్ట్ ఇండియా హైదరాబాద్ ఔదార్యా న్ని చాటుకుంది. మలక్‌పేటలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించింది. సీఎస్సార్ నిధులతో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పా టు చేసింది. విద్యార్థులకు యూనిఫారా లు అందించడంతోపాటు, భవనం ఆధునీకీకరణ పనులు చేపట్టినట్టు స్కిల్‌సాఫ్ట్ ఉపాధ్యక్షుడు రామకృష్ణన్ తెలిపారు.
హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ):ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. రసాయనశాస్త్రంలో నోబుల్ బహుమతి పొందిన బ్రియాన్ కే కొబికా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.