హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. చిగిలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు స్కూల్ ముగిసిన అనంతరం గ్రామ శివారులోని నీటికుంటలో ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీరు చేరడంతో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందారు.