హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో శుక్రవారం ఒకే రోజు ఆరుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఒకరు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి డిబార్ చేశారు.
శుక్రవారం ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పేపర్‌కు పరీక్ష నిర్వహించారు. 5,03,104 విద్యార్థులకు 4,87,317 విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 15,787 మంది (3.13%) విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.