హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు అందడంలేదు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా ఉద్యమ బాటపట్టారు. సోమవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని 197మాడల్ స్కూల్స్‌లో 774 మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరంతా 12ఏండ్లుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, నైట్వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఆరునెలలుగా సర్కారు రూపాయి కూడా వేతనం చెల్లించలేదు. దీంతో ఉద్యోగులంతా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఇన్నాండ్లు ఓపిక పట్టిన వా రంతా సోమవారం నుంచి విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మాడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్‌చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు