కొలంబో: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఛేజింగ్‌లో పాకిస్థాన్‌కు ఫస్ట్ ఓవర్లోనే జలక్ తగిలింది. పాక్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ ఔటయ్యాడు. 176 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా( Hardik Pandya) షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించాడు ఫర్హాన్. పుల్ షాట్ కొట్టాడతను. కానీ ఆ షాట్ మిస్టైం అయ్యింది. బంతి ఎక్కువగా పైకి లేచింది. బౌలింగ్ వేసిన హార్దిక్ మాత్రం అసలు ఆ బంతి ఎటువెళ్తుందో కూడా చూడలేదు. కనీసం కండ్లను కూడా ఆడించలేదు.
ఫర్హాన్ కొట్టిన షాట్ మిస్టైం కావడంతో.. ఆ బంతి నేరుగా వెళ్లి మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రింకూ సింగ్ చేతుల్లో పడింది. రింకూ ఈజీగా ఆ క్యాచ్ పట్టేశాడు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం కనీసం ఫీల్డర్ వైపు చూడలేదు. గాలిలోకి ఎగిరిన బంతి ఎటువెళ్తుందో కూడా అతను గమనించలేదు. బౌలింగ్ చేసి సూటిగా బ్యాటర్ వైపు వెళ్లాడు. రింకూ క్యాచ్ పట్టి సంబరాలు చేసుకుంటున్నా.. ఆ దిశగా అసలు హార్దిక్ చూడలేదు. ఫీల్డర్లు వచ్చి గ్రీటింగ్స్ చేసినా.. పాండ్యా మాత్రం చలనం లేనట్లుగా ముందుకు కదిలాడు. కేవలం బ్యాటర్ వైపు చూస్తూనే ఉండిపోయాడు.
ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడో లేదో చూడకుండానే ఉండిపోయిన పాండ్యా రియాక్షన్ వైరల్ అవుతున్నది. కచ్చితంగా అది క్యాచ్ వెళ్తుందన్న ధీమాతో ఫర్మాన్‌ను చూస్తూ పాండ్యా ముందుకెళ్లాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై బోలడన్ని కామెంట్లు వస్తున్నాయి.
Hardik Pandya did not blink, did not look at the ball, did not even flinch as Sahibzada Farhan lofted him
OUT it was, and he knew 🔥 #INDvsPAK #HardikPandya pic.twitter.com/dLwyjEVsBH
— RB 45 (@Rajendrasi9088) February 15, 2026