SLBC Tunnel Accident | నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మరణించారు. అధునాతన పరికరాలు, రాడార్లను ఉపయోగించి మూడు మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది.
టన్నెల్లో చిక్కుకుని మొత్తం 8 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. డెడ్ బాడీలను బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. శనివారం ఉదయం వరకు రక్షణ చర్యలను ముగించి, ఆ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
Slbc4
సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న ఏడు రోజుల తర్వాత.. చివరకు వారి మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉంటే 8 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడేవారని పలువురు నాయకులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం పట్ల రేవంత్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఓ పక్క ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుంటే.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రాకపోవడంతో సహాయక చర్యల్లో ఒక్క డైరెక్షన్ సక్రమంగా లేదని విమర్శలు వెలువెత్తాయి. మంత్రులేమో పొద్దున్నే వస్తారు.. సాయంత్రానికి వెళ్తున్నారు.. ఘటన జరిగి ఇన్ని రోజులై కార్మికులు చిక్కుకున్నా.. వారిని సురక్షితంగా తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిన్న ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Slbc2
Slbc3