హైదరాబాద్, మార్చి 8: సీఐఐ తెలంగాణ నూతన చైర్మన్గా ఆర్ శివ ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను సీఐఐ నూతన కార్యవర్గాన్ని శనివారం ప్రకటించింది. రాచమల్లు ఫోర్సింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్ రెడ్డి రాచమల్లు చైర్మన్గా ఎంపిక కాగా, వైస్ చైర్మన్గా గౌతమ్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఫోర్సింగ్ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శివ ప్రసాద్ రెడ్డి..డిఫెన్స్, అంతరిక్ష విభాగాలకు చెందిన కీలక విడిభాగాలను ఉత్పత్తి చేసి కేంద్రానికి సరఫరా చేస్తున్నారు. అలాగే ఆయన ఎంఎస్ఎంఈ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ విభాగాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. అలాగే రీ సైస్టెనబిలిటీ లిమిటెడ్(గతంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్) వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న గౌతమ్ రెడ్డి సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు.