భద్రాద్రి రాముడికి పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాములోరి కల్యాణోత్సవం | భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. సీతారాములకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ

భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సీతారాములకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అథితులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రేపు శ్రీసీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకం జరగనుంది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కారణంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు.
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైకుంఠరామునికి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను (స్వర్ణ మూర్తులను) రామదాసు చేయించిన దివ్యాభరణాలతో అందంగా అలంకరించి ఆలయ ప్రాం గణంలోని బేడా మండపం వద్దకు తోడ్కోని వచ్చారు. సీతారాములను అభిముఖంగా ఆశీనులను చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. కొందరు అర్చక స్వాములు రామయ్య తరఫున, మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు.
ఈ ఉత్సవంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనీల్‌కుమార్ దంపతులు, దేవస్థానం ఈఓ శివాజీ దంపతులు, ఏఈఓ శ్రావణ్‌కుమార్, ఈఓ సీసీ అనిల్‌కుమార్, డీఈ రవీందర్‌రాజు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, అర్చక, వైదిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

