11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
- మేడిగడ్డ నుంచి ప్రధాన ప్రాజెక్టుల మీదుగా పర్యటన
- అన్నదాతల సమస్యలు, ప్రజల ఇబ్బందుల పరిశీలన
- 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
- వెల్లడించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 1 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. 2009 నవంబర్ 29న అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ అలుగునూర్ వద్ద అరెస్టయిన చారిత్రక సందర్భాన్ని పురసరించుకొని బీఆర్ఎస్ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు ప్రకటించారు.
రైతులు ఎదురొంటున్న సాగునీటి సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా చేపట్టే బస్సుయాత్ర మేడిగడ్డ నుంచి ప్రారంభమై గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై కరీంనగర్‌లోని శ్వేతా హోటల్లో ఆదివారం సాయంత్రం గంగుల అధ్యక్షతన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
దీక్షా దివస్ ఉత్సవాల నిర్వహణ, కేటీఆర్ బస్సు యాత్ర, రైతుల సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై విసృ్తతంగా చర్చించారు. బస్సుయాత్రలో ఆయా ప్రాజెక్టుల పరిస్థితి, సాగునీరు, ప్రాజెక్టుల ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రస్తుతం రైతులు ఎదురొంటున్న ఇబ్బందులను పరిశీలిస్తూ ప్రజలకు ఆధారాలతో వివరించనున్నట్టు పేర్కొన్నారు. సాగు,తాగునీరు, విద్యుత్తు సమస్యలు, గ్రామీణ ప్రాంతాల ఇబ్బందులను కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
అలుగునూర్‌లో దీక్షా దివస్ సభ
దీక్షా దివస్ సందర్భంగా ఈ నెల 29వ తేదీన మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని అలుగునూర్ లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సభకు సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అరెస్టు జరిగిన అలుగునూర్ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రులు టీ జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

