ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల ఆదివారం రాత్రి జన జాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటుచూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు.
ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. తుడిచేస్తే పోయేది కా�