గంటకు రూ.17 లక్షలు లూటీ
సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, డిజిటల్ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) వెల్లడించింది.
- రోజూ రూ.4 కోట్లకుపైగా దోపిడీ
- తెలంగాణపై సైబర్ నేరగాళ్ల పంజా
- నిరుడు తొలి 9 నెలల్లో రూ.1,104 కోట్లు
- ఈ ఏడాది మరో రూ.881 కోట్లు స్వాహా
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, డిజిటల్ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) వెల్లడించింది. సగటున రోజుకు రూ.4.05 కోట్లు, గంటకు రూ.16.86 లక్షలు, నిమిషానికి రూ.28 వేల చొప్పున నష్టపోయినట్టు స్పష్టమవుతున్నది.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నది. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రజలను భారీగానే కొల్లగొట్టారు. వివిధ మోసాల ద్వారా జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మరో రూ.881.72 కోట్లు కాజేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లోని నగదును నిలిపివేసేందుకు తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నరు. నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రూ.183.11 కోట్లు, ఈ ఏడాది తొలి 9 నెలల్లో మరో రూ.260.30 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ముగిసిన సైబర్ సెక్యూరిటీ మాసోత్సవం
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన మాసోత్సవం విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. పోలీస్ యూనిట్ల పరిధిలోని విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో కమ్యూనిటీ సమావేశాల ద్వారా సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలను వేదికలుగా మలుచుకుని 4,248 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలను ఏడాది పొడవునా కొనసాగించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

