జర్మనీలో జెన్‌జీ గర్జన
జీవన వ్యయం పెరుగుదల, విద్యారంగానికి నిధుల కోత, ప్రభుత్వ ప్రజాసేవలపై ఖర్చు తగ్గింపు, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శనివారం దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో ముసుగులు ధరించిన కొందరు దుకాణాలను లూటీ చేయడంతోపాటు, పోలీసులతో ఘర్షణకు దిగారు. అత్యవసర సేవల సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసిరారు. బెర్లిన్, కొలోన్, హాంబర్గ్లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
- హింసాత్మకంగా మారిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
- ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ
- పోలీసులపై పెట్రోల్ బాంబులు
- జీవన వ్యయం పెరుగుదల, విద్యా రంగానికి నిధుల కోత, తప్పనిసరి సైనిక సేవపై ఆగ్రహం
ఫ్రాంక్ఫర్ట్: జీవన వ్యయం పెరుగుదల, విద్యారంగానికి నిధుల కోత, ప్రభుత్వ ప్రజాసేవలపై ఖర్చు తగ్గింపు, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శనివారం దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో ముసుగులు ధరించిన కొందరు దుకాణాలను లూటీ చేయడంతోపాటు, పోలీసులతో ఘర్షణకు దిగారు. అత్యవసర సేవల సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసిరారు. బెర్లిన్, కొలోన్, హాంబర్గ్లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
జర్మనీ ఆర్థిక కేంద్రంగా పేరొందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనలు రాత్రివేళ హింసాత్మకంగా మారాయి. కనీసం రెండు దుకాణాలను లూటీ చేయగా, మరికొన్ని దుకాణాల అద్దాలను ధ్వంసం చేశారు. దాడులకు గురైన వాటిలో తుపాకుల విక్రయశాల కూడా ఉంది. షాపింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులు రాళ్లు, బాణసంచా, పెట్రోల్ బాంబులతో దాడులకు దిగడంతో పోలీసులు జల ఫిరంగులు, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు.
హాంబర్గ్‌లో నిరసనకారులు కొన్ని బారికేడ్లకు నిప్పంటించారు. కొలోన్లోనూ అత్యవసర సేవల సిబ్బందిపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. బెర్లిన్‌లో మరో నిరసన సందర్భంగా పోలీసులపై గుడ్లు, సీసాలు విసిరినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, పగటిపూట జరిగిన ప్రదర్శనల్లో ఎక్కువభాగం ప్రశాంతంగానే సాగాయి.
విద్య, వైద్య రంగాలకు నిధులు పెంచాలని డిమాండ్
జెన్‌జీ రెగెల్ట్ అనే ప్రచార బృందం ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. విద్య, వైద్య రంగాలకు మరిన్ని నిధులను కేటాయించాలని, ప్రజాసేవలను మెరుగుపరచాలని, పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించాలని యువత డిమాండ్ చేసింది. తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని కూడా వ్యతిరేకించింది.
బెర్లిన్‌లో జరిగిన సభలో ఉద్యమ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ మాట్లాడుతూ.. యుద్ధం, బలవంతపు విధానాలకు బదులుగా శాంతి, స్వేచ్ఛ కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మెరుగైన మద్దతు ఇవ్వాలని, ఆర్థిక భారాన్ని సమానంగా పంచాలని కోరారు.
ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని 18 ఏండ్ల యువకుడు స్టీవ్ విమర్శించాడు. ఖర్చులను తగ్గించే పేరుతో ప్రజా సేవలకు నిధుల కోత విధిస్తూ, యువతపై మరింత భారం మోపుతున్నదని ఆరోపించాడు. తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు నిరసనలను కొనసాగిస్తామని తెలిపాడు. బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ విద్యార్థి బేకర్ కూడా విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. యూనివర్సిటీలోని కొన్ని గదులు నిర్లక్ష్యానికి గురైన భవనాల్లా కనిపిస్తున్నాయని, అలాంటి పరిస్థితుల్లో చదువుకోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఐరోపా వ్యాప్తంగా యువజన ఉద్యమాలు
జర్మనీలో జరిగిన ఆందోళనలు ఐరోపాలో కొనసాగుతున్న యువజన నిరసనల పరంపరలో భాగంగా మారాయి. ఫ్రాన్స్, ఇటలీ, సెర్బియా సహా పలు దేశాల్లో యువత ప్రభుత్వ విధానాలు, జీవన వ్యయం, విద్య, ప్రజా సేవల నాణ్యత వంటి అంశాలపై ఆందోళన చేపడుతున్నది. ప్రజాసేవలకు తగిన నిధులు కేటాయించడం, యువతపై ఆర్థిక భారం తగ్గించడం, సైనిక విధానాలపై స్పష్టత ఇవ్వడం వంటి డిమాండ్లతో జర్మనీలో ప్రారంభమైన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

