హైదరాబాద్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఈనెల 21న నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వామపక్ష మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.