నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20)ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ పీపీ కృష్ణయ్య బుధవారం వాదనలు వినిపించగా, న్యాయస్థానం తీర్పును గురువారానికి వాయిదా వేసింది.
ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని తండ్రి, కొడుకును ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్ (ఏ1), మరో నిందితుడు తినేటి రాజేంద్రకుమార్ (ఏ14) వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుగురి కస్టడీకి ఈడీ వేసిన పిటిషన్‌కు సిట్ పీపీ కృష్ణయ్య కౌంటర్ దాఖలు చేయనున్నారు.