KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) విచారణ ముగిసింది. నందినరగ్లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకుపైగా అధికారులు కేసీఆర్‌ను విచారించారు. ఇదివరకూ విచారించిన వారు పేర్కొన్న అంశాలపై అధికారులు గులాబీ బాస్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ మొత్తాన్ని అధికారులుఉ ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు.
కేసీఆర్‌కు రెండోసారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఆదివారం విచారణ పూర్తి చేశారు. నందినగర్‌లోని నివాసం రెండో అంతస్తులోని గదిలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ మొదలైంది. నాలుగ్గంటల 45 నిమిషాల విచారణ అనంతరం కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో కేసీఆర్ మాట్లాడారు.
అయితే.. మచ్చలేని నేతను విచారణ పేరుతో ఇబ్బందికి గురిచేయడాన్ని తట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంతో వారంతా తెలంగాణ భవన్లో ఆందోళనకు దిగారు.