హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ఐదేండ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గ ఆలయ మెట్లను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుద్ధిచేశారు. తమిళ హీరో కార్తీ, నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ హయాంలో తిరుమల కొండపై అవినీతి జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సాధు పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
సీబీఐ విచారణ జరిపించాలి: వీహెచ్
హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 24: తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. లిబర్టీలోని టీటీడీ ఆలయంలో వీహెచ్ మౌనదీక్ష చేశారు.