హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): డాటాచోరీ కేసులో 11 సంస్థలకు సిట్ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, వ్యవస్థల నుంచి 84 కోట్ల మంది డాటాను సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అపహరించి, దాని ద్వారా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో డాటా లీక్ అయిన కంపెనీల్లో ముందుగా బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్బుక్, క్లబ్ మహేంద్ర, పాలసీ బ జార్, యాక్సిస్ బ్యాంక్, అస్టచ్యూ గ్రూప్, మ్యా ట్రిక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహింద్ర కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. తమ వినియోగదారుల డాటా బ యటకు ఎలా వెళ్లింది? డాటాకు భద్రత ఎందు కు కల్పించలేకపోయారు, దీని వెనుక ఆయా సంస్థల నిర్లక్ష్యమా? డాటాతో మరో పక్క డబ్బు సంపాదించాలనే ఎత్తుగడ ఉన్నదా? అనే అంశాలపై సిట్ ఆరా తీయనున్నది.
క్లౌడ్ సర్వర్ నుంచి నేరుగా లింక్‌లు
దేశవ్యాప్తంగా 24 రాష్ర్టాలతోపాటు 8 మెట్రోపాలిటన్ సిటీలకు సంబంధించి 104 విభాగాలకు చెందిన డాటా చోరీకి గురైంది. తమ వినియోగదారుల డాటాను భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. అయితే సంస్థలు వినియోగదారుల వెరిఫికేషన్, ఇతర పనుల నిమిత్తం ఔట్సోర్సింగ్ సంస్థలకు బాధ్యతలను ఎక్కువగా అప్పగిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఔట్సోర్సింగ్ సంస్థలు, అందులో పనిచేసేవారు డాటాను లీక్ చేస్తున్నారు, ఇందులో కొన్ని సంస్థల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసు విచారణలో వెలుగు చూ సింది. సగం వ్యాపార సంస్థలు ఈ డాటాను కొనుగోలు చేస్తుండగా, మరో సగం పూర్తిగా సైబర్‌నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డాటాను ఎవరు, ఎవరికి అమ్ముతున్నారు? దానిని క్లౌడ్‌లో భద్ర పరిచిందెవరు? వ్యక్తులా? వ్యవస్థలు కూడా దీని వెనుక పనిచేస్తున్నాయా? అనే విషయాలపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. ఆర్మీ అధికారుల డాటా కూడా చోరీ కావడంతో దీనికి వెనుక భారీ కుట్ర కూడా ఉండే అవకాశమున్నదని పోలీసులు భావిస్తున్నారు.
విదేశాలలో డాటా చోరీపై కఠిన చట్టాలు
డాటా అనేది వ్యక్తులు, వ్యవస్థ ప్రయోజనాలు కాపాడే విధంగా ఆయా సంస్థలు భద్ర పరచాలి. డాటాచోరీకి గురైతే ఆయా సంస్థలదే బాధ్యత. డాటాచోరీలను అరికట్టేందుకు యూరోపియన్ యూనియన్, అమెరికా తదితర దేశాలు ప్రత్యేక చట్టాలను తెచ్చాయి. దీని ప్రకారం డాటా లీక్ చేసిన సంస్థకు భారీ ఎత్తున జరిమానా విధిస్తారు. యూరోపియన్ యూనియన్‌లో జీడీపీఆర్(జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులైజేషన్) ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది, అలాగే అమెరికాలో కాలిఫోర్నియా కన్యుజమర్ ప్రైవసీ యాక్ట్‌లు ఇలా ఆయా దేశాలు డాటా చోరీ కాకుండా ఉండేలా ప్రత్యేక చట్టాలు అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘింనిచ కంపెనీలకు 2 నుంచి 4 శాతం జరిమాలుంటున్నాయి. భారతదేశంలో మాత్రం ఇంకా ఐటీ యాక్ట్‌పైనే ప్రస్తుతం ఆధారపడుతున్నారు. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ 2022 బిల్లు పార్లమెంట్లో పెట్టినా.. ఆ బిల్ ఇంకా పాస్ కాలేదు.