హెచ్‌సీఏ అక్రమాలపై సిట్.. చీఫ్‌గా ఫ్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు.
- హెచ్‌సీఏ అంశంపై నమోదైన అన్ని కేసుల విచారణ
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. సిట్‌కు చీఫ్‌గా ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఐజీ తరుణ్జోషీని నియమించారు. అయితే, ఈ సిట్‌ను గత నెలలోనే ఏర్పాటు చేసినా విషయం బయటికి రాలేదు. సిట్‌లో సభ్యురాలిగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ ఎస్పీ సీ నర్మదను తొలగించి, సీఐడీ హెడ్‌క్వార్టర్స్ ఎస్పీగా ఉన్న ఎన్ అశోక్‌కుమార్‌ను చేర్చుతూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, హెచ్‌సీఏపై నమోదైన నాలుగు కేసులను ఈ సిట్‌కు బదిలీ చేశారు.
గతంలో నమోదైన కేసులతోపాటు తాజా కేసులపై సిట్ దర్యాప్తు చేయనున్నది. 2011లో వివిధ క్రికెట్ క్లబ్‌ల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు తొలి కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ స్టేడియం నిర్మాణ వ్యయాన్ని రూ.30 కోట్ల నుంచి రూ.108 కోట్లకు పెంచడం, కుర్చీల కొనుగోలులో అవినీతిపై ఈ కేసులు నమోదుచేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో పలువురు మాజీ క్రికెటర్లు ఉన్నారు. 2014లో ఉప్పల్ స్టేడియంలో రెండు స్టాండ్స్‌కు పైకప్పు నిర్మాణ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి, రూ.3 కోట్లకు పైగా నష్టం చేకూర్చారనే ఆరోపణలపై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇందులోనూ పలువురు ప్రముఖులు ఉన్నారు. 2023 అక్టోబర్‌లో హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంతే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ స్టేడియం పరికరాల కొనుగోళ్లలో రూ.3.85 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని కొన్ని కేసులు నమోదయ్యాయి. దీని ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. 2025 జూలైలో క్రికెట్ బంతుల కొనుగోలు, ప్లంబింగ్ పనుల నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలపై తెలంగాణ సీఐడీ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ అన్ని కేసులపై సీఐడీ తరఫున ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సిట్ చీఫ్‌గా ఫ్యూచర్‌సిటీ సీపీ, ఐజీ తరుణ్‌జోషి
- సభ్యులుగా పలువురు ఉన్నతాధికారుల నియామకం
- హెచ్‌సీఏ అంశంపై నమోదైన అన్ని కేసుల విచారణ
సిట్‌లో సభ్యులు వీరే..
1) డాక్టర్ తరుణ్ జోషి, ఫ్యూచర్ సిటీ సీపీ, సిట్ చీఫ్
2) ఎన్ అశోక్‌కుమార్, సీఐడీ ఎస్పీ
3) ఎన్ఎస్ మోహన్ రాజా, సీఐడీ అడిషనల్ ఎస్పీ
4) ఎస్ మోహన్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ హైదరాబాద్
5) జీ గోపీనాథ్, సీఐడీ ఇన్స్పెక్టర్
6) పీ రాజశేఖర్, సీఐడీ ఇన్స్పెక్టర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

