సిరిసిల్ల రూరల్, ఆగస్టు 19: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోగల టెక్స్టైల్ పార్క్‌లోని కార్మికులు మంగళవారం సమ్మెబాట పట్టారు. టెక్స్టైల్ పార్క్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ వస్ర్తాలకు కూలి పెంచాలని ఇటీవలే కోరగా, యజమానులు ఎటూ తేల్చకపోవడంతో ఆందోళనకు దిగారు. టెక్స్టైల్ పార్క్‌లో యూనియాన్ అధ్యక్షుడు కూచన శంకర్ అధ్యక్షతన పవర్‌లూం కార్మికుల సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ వస్త్రాలకు యజమానులు కూలి పెంచే వరకు కార్మికులు పనుల్లోకి వెళ్లకూడదని తీర్మానించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ.. కార్మికులకు కూలి పెంచాలని, ప్రభుత్వ వస్ర్తాలకు రోజుకు రూ.వెయ్యి పెంచాలని డిమాండ్ చేశారు.