హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య(Sirisilla Rajaiah) సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను ప్రజాభావన్(Prajabhavan)లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క రాజయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్‌గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అజ్మతుల్లా హుసేన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌లో సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, మాలోత్ నెహ్రూ నాయక్‌ను నియమించింది. అలాగే ప్రభుత్వ అధికారిక తెలంగాణ మాస పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా కోడూరి శ్రీనివాస్‌రావును నియమించింది.