హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగా ణ): చేనేత కళాకారులకు పుట్టినిల్లు అయిన సిరిసిల్ల మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. చేనేత కళాకారుడు నల్లా విజయ్ సువాసనలు వెదజల్లే వెండి చీరను మగ్గంపై నేశాడు. ఈ చీర ను మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. సుగంధ ద్రవ్యాలు, వెండితో నెలన్నరపాటు శ్రమించి ఈ చీరను తయారు చేశానని కేటీఆర్‌కు విజయ్ వివరించాడు.
ఇప్పటిదాకా విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తులకు సం బంధించిన వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకొన్నారు. విజయ్ కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన, అద్భుతమైన ప్రతిభకు విజయ్ నిదర్శనం అని కొనియాడారు. సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అభిలషించారు. విజయ్‌కి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు.