హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలే బీసీలకు తీరని ద్రోహం చేశాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి బుధవారం ప్రకటనలో విమర్శించారు. 75 ఏండ్లుగా బీసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా దుర్భరమైన, దయనీయ స్థితిలో బతుకీడ్చే అ మానుషానికి పాల్పడ్డాయని దుయ్యబట్టా రు. రాజ్యాధికారాన్ని అగ్రకులాల చేతిలో పెట్టి, దేశాన్ని ఆధిపత్య కులాల హక్కుభుక్తం చేశాయని ధ్వజమెత్తారు. రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కకుండా చేశాయని, కులగణన చేయకుండా, బీసీ మం త్రిత్వశాఖ ఏర్పాటు చేయకుండా, బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్రమైన ద్రోహానికి ఒడిగట్టాయని మండిపడ్డారు.
బీసీల అం శంపై తాజాగా కాంగ్రెస్, బీజేపీ కపటనాటకం గుట్టు రట్టయ్యిందని ఆరోపించారు. కుట్రలతో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేసింది చాలక, బీఆర్ఎస్పై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు హస్యాస్పందంగా ఉన్నాయని, వాటిని తీ వ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. బీసీల సర్వ అనర్థాలకు కారణభూతమైన కాం గ్రెస్.. ఇవాళ బీసీ వాదాన్ని ఎత్తుకోవడం.. ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. బీసీలను కేవలం ఓటర్లుగా ఉపయోగించుకునే దుర్మార్గపు వైఖరికి నిదర్శనం కామారెడ్డి డిక్లరేషన్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కామారెడ్డి డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిందని తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్‌లో తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధమైన హోదాతో, బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని అన్న విషయాన్ని గుర్తుచేశారు.
రూ.20 వేల కోట్లు ఏమయ్యాయి?
బీసీ సంక్షేమానికి ఏటా రూ.20,000 కోట్ల చొప్పున ఐదేండ్లలో మొత్తం రూ.ఒక లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని మధుసూదనాచారి ప్ర శ్నించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలను ఏ ర్పాటు చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిందని విమర్శించారు. వీటితోపాటు ముదిరాజ్, గంగపుత్ర, విశ్వకర్మ, నాయీబ్రాహ్మణ, గౌడ, గొల్లకురుమ, పద్మశాలి, రజక, మున్నూరుకాపు వంటి వివిధ బీసీ కులాలకు అనేక హామీలను కామారెడ్డి డిక్లరేషన్, మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందని తెలిపారు. కానీ, ఇప్పుడా వాటి ఊసే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. బీసీలను వంచించడం, కాంగ్రెస్‌తో పాటు బీజేపికి కూడా పరిపాటే అని విమర్శించారు.
బీసీలకు సమన్యాయం వద్దా?
తమిళనాడులో జనాభాకు అనుగుణం గా 9వ షెడ్యూల్లో చేర్చిన విధంగానే తెలంగాణ బీసీలకు సమన్యాయం వర్తంచొద్దా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ.. బీసీ బిల్లు పేరిట దగా చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందుగానే మారాయని ఆరోపించారు.
8 మంది చొప్పున ఎంపీలున్నా ఏంలాభం?
తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది, కాంగ్రెస్‌కు 8 మంది చొప్పున ఎంపీలు ఉన్నప్పటికీ, బీసీ రిజర్వేషన్లు సాధించే క్రమంలో వారికేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సిరికొండ మధుసూదనాచారి దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. రిజర్వేషన్లకు మతంరంగు పులమడం, బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని పేర్కొన్నారు. బడ్జెట్‌తో సంబంధం లేని హామీలు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కార్పొరేషన్ చైర్మన్లలో, ఇతర నామినేటెడ్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపుతున్నారని తూర్పారబట్టారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు పెద్దపీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటైన వెంటనే రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, ఆర్థిక శాఖ వంటి కీలక పదవులతోపాటు అనేక మంది బీసీ నేతలకు రాజ్యసభ సభ్యులుగా కేసీఆర్ అవకాశాలు కల్పించారని తెలిపారు