కుట్రలను తిప్పికొట్టి రాజకీయశక్తిగా ఎదగాలి
రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు తమపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టి, రాజకీయశక్తిగా ఎదగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
- విశ్వకర్మలు కలిసికట్టుగా సాగాలి
- శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపు
ఖైరతాబాద్, జూన్ 27: రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు తమపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టి, రాజకీయశక్తిగా ఎదగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో విశ్వకర్మల జనాభా, కుటుంబాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. దేశం, రాష్ట్రంలో అధికార మార్పిడి కేవలం రెండు నుంచి మూడు శాతం ఓట్ల తేడాతోనే జరుగుతున్నదని గుర్తు చేశారు.
అత్యధిక శాతం జనాభా ఉన్న విశ్వబ్రాహ్మణులు ఐక్యమైతే ఎక్కడ తమ పీఠాలు కదిలిపోతాయోనని అగ్రకులా లు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. విశ్వకర్మలు సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నప్పటికీ సామాజిక, ఆర్థిక భద్రత కరువైందని తెలిపారు. విశ్వకర్మల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఒకవేళ స్పం దించకపోతే స్పష్టమైన కార్యాచరణతో ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు. విశ్వబ్రాహ్మణ సం ఘం ప్రతినిధులు దాసోజు గోవర్ధనాచారి, మదన్మోహన్ యాదగిరి మాట్లాడుతూ యా దాద్రి ఆలయ పునర్నిర్మాణంలో విశ్వకర్మలు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారని గు ర్తు చేశారు.
సమాజంలో విశ్వకర్మలు తీవ్ర వె నుకబాటులో ఉన్నారని, వారి స్థితిగతులపై స మగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అధికారిక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచా రి తన తండ్రి గతంలో చేసిన శిల్పకళా వృత్తికి సంబంధించిన గుర్తులు, నాటి కళాకారుల జీవనశైలిని ప్రతిబింబించేలా ఒక చిన్న మ్యూ జియాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వం విశ్వకర్మ మ్యూజియం ఏర్పాటు చేసుకునేందుకు స్థలం, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షుడు ఏ రవీంద్రాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యాదగిరి, జగన్నాథం, కాళీదాస్, గణేశ్‌చారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

