శాయంపేట, డిసెంబర్ 13: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్‌లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో శనివారం బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ ఫుట్‌బాల్ ఆటకు సింగరేణి నిధులను ఎందుకు వెచ్చిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ మోసాలను అడుగడుగునా అ డ్డుకునే బలమైన గొంతుకలుగా నిలుస్తారని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి ఊరికీ శ్మశానవాటిక, ట్రాక్టర్, డంప్‌యార్డు, ప్రకృతి వనాలు ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు. అన్నింటా ఫెయిలైన కాంగ్రెస్‌కు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.