6 గ్యారెంటీల ఊసేది?: మధుసూదనాచారి
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్ర వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల ఊసే లేదని, హామీల అమల్లో సర్కార్ ప్రజలను ధోకా చేసిందని శా సనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం శుక్ర వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల ఊసే లేదని, హామీల అమల్లో సర్కార్ ప్రజలను ధోకా చేసిందని శా సనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడి యా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రజ ల అవసరాలు గుర్తించి హామీలివ్వడం, ఇచ్చిన హామీలను సమర్థంగా అమలుచేయడం పాలకుల విధి అని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అంశాలు లేకపోవడంతో బడ్జెట్ కేటాయింపులను బీఆర్ఎస్ పక్షాన నిరసిస్తున్నట్టు తెలిపారు. గత బడ్జెట్లో పలు పథకాల కోసం కేటాయించిన నిధుల ఖర్చును టెలిస్కోప్ పెట్టి చూసినా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
రైతు భరోసా ప్రస్తావన ఎక్కడా లేదని పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, గత రెండు బడ్జెట్లల్లో కలిపి ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లేనని దెప్పిపొడిచారు. విద్యార్థులు, నిరుద్యోగు లు, బీస్సీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రై తులను దగా చేసిందని ధ్వజమెత్తారు. గత బడ్జెట్లో కొన్ని పథకాలకు కేటాయి ంచిన నిధులను ఖర్చుచేయని ఈ సర్కార్‌ను నమ్మేది ఎలా? అని ప్రశ్నించారు. కీలకమైన గవర్నర్ ప్రసంగంపై చర్చ వదిలేసి సీఎం ఢిల్లీకి వెళ్లొచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నర గంటల ప్రసంగంలో కేసీఆర్‌పై ఏడ్వడం, ఇచ్చిన హామీల అడిగితే ఎదురుదాడి చేయడం, అబద్ధాలు చెప్పడం తప్ప.. ఇంకేం చే శారు? అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

