జయశంకర్ భూపాలపల్లి, జూలై 31 (నమస్తే తెలంగాణ): మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గురువా రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా న్ని సందర్శించారు.
తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడారు. బ్లాక్ బోర్డుపై ‘బెస్ట్ ఆఫ్ లక్.. గాడ్ బ్లెస్ యూ మై డియర్ స్టూడెంట్స్’ అని రాసి వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. పాఠశాలలో మెనూను పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏఈకి ఫోన్ చేసి మాట్లాడారు.
విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అలాగే ఏరియాలోని కేటీకే 1,5 ఇైంక్లెన్లో పర్యటించి కార్మికులతో ము చ్చటించారు. గనుల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేటీకే 1 ఇైంక్లెన్లో పనిచేస్తున్న సత్యనారాయణరెడ్డి, 5 ఇైంక్లెన్లో పనిచేస్తున్న ఆకుల కొమురయ్య, శంకరయ్య ఉద్యోగ విరమణ పొందడంతో మధుసూదనాచారి హాజరై వారిని సన్మానించారు. గనులపై తిరుగుతూ కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. తన హయాంలో ఇప్పించిన హెచ్ఆర్ఏ గురించి కార్మికులకు గుర్తుచేశారు.