KTR | సిరిసిల్ల టౌన్, జూన్ 1: అమెరికాలోని డల్లాస్లో జూన్ 2న (సోమవారం) జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆదివారం డల్లాస్లో సిరిసిల్ల వాసులు ”సిరిసిల్ల టు సిలికాన్” పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. దాదాపు 100 మందికి పైగా సిరిసిల్లకు చెందిన ఎన్నారైలు పాల్గొని సందడి చేశారు. తమ అభిమాన నాయకుడు కేటీఆర్ చిత్రపటాలతో ఏర్పాటుచేసిన కటౌట్లతో భారీ స్వాగతం పలికారు. ఇక్కడ అఖిల్ పటేల్ కల్లూరి, ఉమ్మారెడ్డి ఫణీందర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రావు, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.