సిరిసిల్ల టౌన్, మార్చి 28: సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. గతంలో అగ్గిపెట్టె లో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్ వంటి అనేక వినూత్న వస్ర్తాలను రూపొందించాడు. చేనేత మగ్గంపై పట్టుపీతాంబరం చీరను 20 రోజులపాటు శ్రమించి తయారుచేశాడు. 750 గ్రాముల బరువుతో తయారు చేసిన చీర కోసం 150 పట్టుదారాలను వినియోగించినట్టు హరిప్రసాద్ తెలిపాడు. ఈ పట్టుపీతాంబరం చీర ను భద్రాద్రి సీతమ్మ వారికి ప్రభుత్వం తరఫున అందజేయాలని మంత్రి కేటీఆర్‌ను కోర గా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు మంగళవా రం దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కు అందజేసినట్టు తెలిపారు. పట్టుపీతాంబరం చీర అద్భుతంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అభినందించారన్నారు.