ఓటుహక్కు పొందడానికి సర్లో అవకాశం
ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది.
- ఒకవేళ ఓటు లభించకపోతే అప్పుడు కోర్టును ఆశ్రయించండి: హైకోర్టు
హైదరాబాద్, జూన్ 30,( నమస్తే తెలంగాణ ): ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఓటు హక్కు పొందడానికి చట్టబద్ధమైన అవకాశం ఉన్నపుడు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయదని తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ కుతుబుద్దీన్మసూద్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితా నుంచి పిటిషనర్ తోపాటు కుటుంబసభ్యుల ఓట్లను తొలగించడంతో 2024 ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించలేకపోయినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లను పునరుద్ధరించకపోతే సర్ కార్యక్రమంలో తమ దరఖాస్తులను స్వీకరించకుండా తిరసరించే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ సర్ కార్యక్రమంలో పేర్లు పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పారు. వాదనలను విన్న బెంచ్ చట్టపరమైన విధానం సర్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేరొంది. బీఎల్వోలకు వివరాలు సమర్పిస్తే పేర్లను తిరిగి చేర్చడానికి అవకాశం ఉందని, ఒకవేళ ఓటర్ల జాబితాలో చేర్చకపోతే ఎన్నికల అధికారులను ఆశ్రయించాలని, అప్పటికీ చర్యలు లేకపోతే చట్టప్రకారం కోర్టును ఆశ్రయించవచ్చంటూ పిటిషన్పై విచారణను ముగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

