రెండు రోజుల్లో కర్ణెతండా లిఫ్ట్ ప్రారంభించాల్సిందే
కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయిన ప్రాంతాల్లోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
- లేదంటే ముట్టడిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి అల్టిమేటం
- బీఆర్ఎస్ నాయకులతో కలిసి కర్ణెతండా లిఫ్ట్ పరిశీలన
ఖిల్లాఘణపురం, ఆగస్టు 20 : కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయిన ప్రాంతాల్లోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని కర్ణెతండా ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2022 మార్చి 8న రూ.76.16 కోట్లతో కర్ణె తండా లిఫ్ట్‌నకు శంకుస్థాపన చేయగా.. పనులు పూర్తి చేశామన్నారు.
కేవలం సబ్‌స్టేషన్ నిర్మాణం మాత్రమే పెండింగ్‌లో ఉన్నదని, ఇందుకోసం రూ.2 కోట్లు కూడా మంజూరు చేసి ఉంచినట్టు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సబ్‌స్టేషన్ పూర్తి చేయడానికి రెండేండ్లు తీసుకున్నదని విమర్శించారు. రైతుల ఒత్తిడితో వెట్న్ నిర్వహించి తర్వాత మోటర్లు బంద్ పెట్టారని, ప్రస్తుతం కృష్ణానదికి వరదలు వస్తున్నాయని, వెంటనే మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పథకంతో దాదాపు 6 గ్రామాలు, 9 గిరిజన తండాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. 58 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు 800 హార్స్పవర్ మోటర్లు రెండు ఏర్పాటుచేశామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతలు ప్రారంభించాలని, డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

