గోపాల్పేట, ఏప్రిల్ 15 : తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు బొల్లెద్దుల బాలరాజు అధ్యక్షతన మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించారు.
తొర్రూరు, ఏప్రిల్ 15: క్యాబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురసరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే రేవంత్‌రెడ్డి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నాడని, తాను చాలాసార్లు చెప్పినా వైఖరి మార్చుకోలేదని తెలిపారు. రేవంత్ తన శిష్యుడే అయినా, అతడి ప్రవర్తనను ఎప్పుడూ సహించలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్ గెలిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని స్పష్టంచేశారు.
కాటారం, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల సమావేశాల్లో మాట్లాడారు.