హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : తాను ఎలాంటి తప్పు చేయలేదని, చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సింగర్ మంగ్లీ తెలిపారు. రూ.10కోట్ల మైక్రో ఫైనాన్స్ వివాదంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని బుధవారం డీజీపీ ఆఫీసులో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్‌కు మంగ్లీ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడు తూ సింగర్‌గా తనకు పాటలు తప్ప ఎలాంటి స్కా ములు తెలియవని చెప్పారు. తన ప్రమేయం లేని ఆర్థిక వివాదం కారణంగా మా నసికంగా నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ కేసులో తాను బాధితుల పక్షానే ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చా రు. తన పేరును అనవసరంగా వాడి అప్రతిష్ఠకు పాల్పడ్డ మధునాయక్, హిమాకాంత్రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావుపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఎంతోకష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఎవరినీ మో సం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. నిజం తెలుసుకోకుండా దోషిగా చిత్రీకరించడం బాధాకరమని పేరొన్నారు. ఈ కేసులో బాధితుల తరపున మాట్లాడుతున్న అడ్వొకేట్ సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసమే తన పేరును వాడుకుంటున్నారని చెప్పా రు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై, ముఖ్యంగా అడ్వొకేట్ సుబ్బారావుపై చట్టపరంగా ముందుకు వెళ్తానని, అవసరమైతే పరువునష్టం నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. నేరగాళ్లే బాధితుల రూపంలో వస్తున్నారని మంగ్లీ తరఫు న్యాయవాది చెప్పారు.