హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది రూ.400 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క శుక్రవారం ప్రకటించారు. సంస్థలో 39,500మంది కార్మికులు పనిచేస్తుండగా ఒక్కొక్కరికి రూ.1.03 లక్షలు బోనస్‌గా అందుతుందని చెప్పారు. శనివారం బోనస్ చెల్లిస్తామని సింగరేణి శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నది.
బోనస్‌పై హైదరాబాద్‌లో ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ కారణంగా తర్జనభర్జనల తర్వాత ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బోనస్‌పై ప్రకటన చేశారు. మరోవైపు కొంతకాలంగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చెల్లించడంలేదని, వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.