గోదావరిఖని, ఆగస్టు 3: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో కేసీఆర్ వందకు వందశాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరారని, మెడికల్ బోర్డుకి జరుగుతున్న ఇబ్బందితో 80 శాతం నుంచి 90 శాతం ఇన్వాల్యుయేషన్ చేసి 19వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కారుణ్య నియామకాలను కనుమరుగు చేసే పరిస్థితి కనపడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, జావిద్పాష, కొమురయ్య బదిలీలను వెంటనే రద్దు చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
30, 31 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డును పునః సమీక్షించి, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సురేందర్‌రెడ్డి, మాదాసు రామ్మూర్తి, నూనె కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, మేడిపల్లి సంపత్, చెల్పూర్తి సతీశ్, రమేశ్, అన్వేశ్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, చల్లా రవీందర్‌రెడ్డి, శేషగిరి, అంజయ్య, జోసెఫ్, బొడ్డు రమేశ్, రొడ్డ సంపత్, శంకర్, మీనరాజు పాల్గొన్నారు.