హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టు ముసుగులో సింగరేణిపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది. సోమవారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తూ అంకితభావానికి ప్రతీకైన ప్రతిష్టాత్మక సంస్థపై సిద్దిపేటకు చెందిన ఎస్కే మహ్మద్ జునైద్ మునావర్ పాషా జర్నలిస్ట్ పేరు చెప్పుకొని జుగుప్సాకరమైన పదజాలంతో దూషిస్తూ సందేశాలు పంపుతున్నాడని వెల్లడించింది.
ఆయనపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించింది. జర్నలిస్టులంటే తమకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ ఆధారరహితంగా తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని తేల్చిచెప్పింది.