గోదావరిఖని, జూన్ 15: శ్రీరాంపూర్ ఏరియాలో డిపెండెంట్ అభ్యర్థులకు నియామ క పత్రాలు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించి సింగరేణి నిధులు వృథా చేశారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డిపెండెంట్ల నియామక ప త్రాలు ఇవ్వడానికి రూ.50లక్షలు ఖర్చు చేసి సంస్థకు ఇంకా నష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి రవి ఉన్నారు.