Singareni Elections | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత స్క్రూటిని, విత్‌డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు. 28న పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు కౌంటింగ్ చేపట్టనున్నారు. అయితే, మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, వరుసగా పండగలు ఉండడంతో వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.