హైదరాబాద్, ఫిబ్రవరి 27,(నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సహాయ చర్యల్లో మరింత తోడ్పాటును ఇచ్చేందుకు మరో 200 మంది రెస్యూ సిబ్బందిని పంపించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆయన ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్నారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి సింగరేణి రెస్యూ బృందం సహాయ చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ఘటనా స్థలికి చేరిన 100 మందికి పైగా సిబ్బందిని, అత్యాధునిక సహాయ సామగ్రిని చేరవేసినట్టు తెలిపారు. చికుకున్న వారు క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు.