హైదరాబాద్, డిసెంబర్22 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం నాయక్ డిప్యూటేషన్‌ను మరో ఏడాదిపాటు పొడిగించారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయననే పూర్తిస్థాయి సీఎండీగా నియమించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.