హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బొగ్గు సంక్షోభం వార్తలతో ఆందోళన చెందుతున్న విద్యుదుత్పత్తి సంస్థలకు సింగరేణి భరోసా ఇచ్చింది. తమ సంస్థతో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ర్టాల థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేసేందుకు అన్ని చర్య లు తీసుకొంటున్నట్టు సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్ బలరామ్ (ఫైనాన్స్, పర్సనల్, పీ అండ్ పీ) తెలిపారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్తు కేం ద్రాల్లో కనీసం ఐదు రోజులకు సరిపడా బొగ్గు ని ల్వలు ఉన్నాయని, విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం లేదని స్పష్టంచేశారు. దేశంలో బొగ్గు కొరత వార్తల నేపథ్యంలో సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు సో మవారం సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ, దసరా నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశా నిర్దేశం చేశారు. ఈ నెలలో రోజూ 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, కనీసం 34 రేకులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెం చడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు.
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య విద్యుత్తు సంస్థలకు