హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తి అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ సీఎండీ ఎన్ బలరాం విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. బొగ్గుతో పాటు ఇతర రంగాల్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ముఖ్యంగా రెన్యూవబుల్ విద్యుత్తు ఉత్పత్తి రంగంలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇక సింగరేణికి అనుబంధంగా ‘గ్లోబల్ సింగరేణి లిమిటెడ్’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన ఆయన… తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047కు అనుగుణంగా ఈ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.